శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (21:45 IST)

శిల్ప చౌదరినా మజాకా, క్లబ్బు ప్రారంభోత్సవానికి కాజల్ అగర్వాల్‌ను పిలిచి...

శిల్ప కేసులో పోలీసుల విచారణలో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విఐపిల వద్ద డబ్బులు కొట్టేసి హైఫై లైఫ్ ఎంజాయ్ చేసిందట శిల్ప. దివినోస్ క్లబ్ ప్రారంభోత్సవానికి హీరోయిన్ కాజల్ అగర్వాల్ పిలిచిందట. అంతేకాదు కోట్ల రూపాయల ఖర్చుతో పార్టనర్‌తో కలిసి శిల్ప పార్టీ ఇచ్చిందట. 

 
ఆ పార్టీలో ర్యాంప్ పైన శిల్ప క్యాట్ వాక్ కూడా చేసిందట. కిలాడీ లేడీగా పేరు పొందిన శిల్పలో విభిన్న కోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాజల్ అగర్వాల్‌ను పిలిచి కార్యక్రమం నిర్వహించిందట. అంతేకాదు మొత్తం 200 మంది విఐపిల భార్యలను పిలిచిందట.

 
ఇలా ఒక్కొక్కటిగా శిల్ప వ్యవహారం కాస్త బయటకు వస్తుండటంతో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారుతోంది. ఇంకా పోలీసులు శిల్పకు సంబంధించిన వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతున్నారు.