గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (18:33 IST)

బికినీతో పండుగ చేసుకున్న స‌మంత‌!

Samantha
న‌టి స‌మంత ఇటీవ‌లే చాలా హాట్ టాపిక్ గా మారింది. పుష్ప‌లో ఐటం సాంగ్ చేసిన త‌ర్వాత ఆమె రిలాక్స్ కోసం టూర్ వెళ్ళింది. మూడురోజుల‌నాడు క్రిస్‌మ‌స్ పండుగ‌ను గోవా బీచ్‌లో జ‌రుపుకున్న‌ట్లు పొటోలు పెట్టింది. స్నేహితులంతా బికీనీల‌తో ద‌ర్శ‌న‌మిచ్చారు. స‌మంత మాత్రం ఇంకాస్త రెచ్చ‌గొట్టేలా గోవా లోని ఒక సరస్సులో జలకాలాడుతూ కనిపించింది. 
 
Samantha
ఇటీవ‌లే త‌న తాజా సినిమా ‘యశోద’ షూటింగ్ ని కంప్లీట్ చేసి గోవా టూర్ కి వెళ్ళింది. స్నేహితులు శిల్పా రెడ్డి తో కలిసి గోవా టూర్ ని ఎంజాయ్ చేస్తోంది. అక్కడి ఫోటోలను సామ్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకొంటుంది. ఈ ఫొటోలు అభిమానుల‌ను అల‌రిస్తున్నాయి. పూలపూల బికినీలో థైస్ ని ఎలివేట్ చేస్తూ, ఎద అందాలను ఆరబోస్తూ చిరునవ్వు చిందిస్తున్న ఫోటోలు అభిమానుల‌ను ఎంజాయ్ చేసేలా చేసింది.