గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (19:01 IST)

విహారయాత్రకు వెళ్తే.. కారును ఆపి భర్తను నిర్భంధించి.. భార్యపై అత్యాచారం

కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ మహిళ కామాంధుల బారినపడింది. తన భర్త, పిల్లలతో కలిసి కారులో బయలు దేరిన మహిళపై అత్యాచారం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. తన భర్త, పిల్లలతో కలిసి కారులో బయలు దేరామని ఆ మహిళ పోలీసు ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత విహార యాత్ర ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.. రఘోఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరోన్ రోడ్‌లో ఇద్దరు వ్యక్తులు కారును ఆపమని వారికి సంకేతాలు ఇచ్చారని పోలీసు సూపరింటెండెంట్ రాజీవ్ మిశ్రా తెలిపారు.
 
వారు కారును ఆపిన తర్వాత, వారిలో ఒకరు తన భర్తను తుపాకీతో పట్టుకోగా, మరొకరు ఆమెను సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని అతను చెప్పాడు. ఫిర్యాదు ప్రకారం, నిందితులు ఒకరినొకరు సోను, సుమేర్ అని సంబోధించారని అధికారి తెలిపారు.