గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (16:17 IST)

ఒరిస్సాలో దారుణం : భర్త - కుమారుడి కళ్లెదుటే మహిళ అత్యాచారం

ఒరిస్సా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వివాహితపై కట్టుకున్న భర్త, కన్న కుమారుడి కళ్లెదుటే అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై తక్షణం స్పందించిన పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని జయపురం స్థానిక సమితిలో ఒక వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే, జయపురం సమితి కుములిపుట్ పంచాయతీ ప్రాంతానికి చెందిన మీణా హరిజన్, అతని స్నేహితులు ఆ వ్యక్తి భార్యపై కన్నేశారు. వారి ఇంట్లోకిదూరి ఆమె భర్త, కుమారుడుని కట్టేసి, వారి కళ్ళ ఎదుటే అత్యాచారనికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత తన భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... బుధవారం మీణా హరిజన్‌ను అరెస్టు చేయగా, మరికొందరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కామాంధులను కఠినంగా శిక్షించాలని అన్ని పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.