1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 10 డిశెంబరు 2021 (16:28 IST)

అన్నగారి కుటుంబం, ఎన్టీయార్ మ‌న‌వ‌రాలి నిశ్చితార్థం

తెలుగుదేశం వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుటుంబం అంతా ఒక‌చోట క‌లిసింది. ఆనంద ఆత్మీయ ప‌ల‌క‌రింపుల‌తో అంతా ఒక‌సారి ఏక‌మైయ్యారు. ఒక‌రినొక‌రు ఆలింగ‌నాలే కాదు... మ‌న‌సు విప్పి మాట్లాడుకున్నారు. ఇదంతా ఎన్టీ రామారావు కుమార్తె ఉమామహేశ్వరి కూతురు ఎంగేజ్‍మెంట్‍లో క‌నిపించిన ఆత్మీయ సమ్మేళనం.
 
 
ఈ అందమైన కుటుంబ క‌ల‌యిక‌, తెలుగుదేశం అభిమానుల్లో ఉత్సాహాన్ని క‌లిగించింది. ముఖ్యంగా చాలా కాలం త‌ర్వాత‌, తోడ‌ళ్ళుళ్ళు క‌ల‌సి చ‌క్క‌గా మాట్లాడుకున్నారు. రాజ‌కీయ ఆలోచ‌న‌ల‌కు భిన్నంగా, ఆత్మీయ భావంతో వ్య‌వ‌హ‌రించారు. మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న తోడ‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు చాలా కాలం తర్వాత కలిశారు. చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలు ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి కూతురు ఎంగేజ్‍మెంట్‍లో ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకున్నారు. 
 
 
ఇదే పెళ్ళి వేదిక‌గా మనసు విప్పి మాట్లాడుకున్న చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు త‌మ చుట్టరికాన్ని చాటుకున్నారు. నంద‌మూరి బాలకృష్ణ, పురంధేశ్వరి, భువనేశ్వరితో పాటు, తోబుట్టువులు, అంద‌రూ నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె కూతురు వివాహ వేడుకలో పాలుపంచుకున్నారు. పెళ్ళి కుమార్తెను చేసిన సందర్భంగా హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు ఈ శుభ‌కార్యం వేదిక‌గా క‌లిసి మ‌ధుర క్ష‌ణాల్ని ఆస్వాదించారు.