శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (09:24 IST)

చిత్రపరిశ్రమలో వరుస విషాదాలు.. సీనియర్ నటి, రేడియో జాకీ మృతి

దక్షిణభారత చలన చిత్ర పరిశ్రమలో వరుసగా విషాద ఘటనలు సంభవిస్తున్నాయి. తాజాగా ప్రముఖ మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటి లలిత కన్నుమూశారు. ఈమె అనారోగ్యంతో మృతి చెందారు. ఈమె మలయాళ, తమిళ చిత్రాల్లో నటించారు. 
 
మరోవైపు ప్రముఖ కన్నడ రేడియో జాకీ రచన కూడా మంగళవారం హఠాన్మరణం చెందారు. ఈమెకు గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. జేపీ నగర్‌లో తన నివాసంలోనే ఆమె చనిపోయారు. 
 
ఛాతిలో నొప్పిగా వుందని రచన చెప్పగానే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే రచన చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. మలయాళ నటి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ సంతాపాలు వెల్లడించారు.