శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (22:30 IST)

వేదికపై ఫోన్ చూస్తున్నావా? కామన్ సెన్స్ వుండాలి కదా? అలీపై మోహన్ బాబు ఫైర్

Ali_mohan Babu
ప్రముఖ నటుడు అలీపై విలక్షణ నటుడు మోహన్ సీరియస్ అయ్యారు. స్టేజీపై తాను మాట్లాడుతుండగా వినకుండా మొబైల్ చూస్తున్నాడని సీరియస్ అయ్యారు. దీంతో అలీ మోహన్ బాబు మాటలకు కాస్త జడుసుకుని ఫోన్ లోపల పెట్టేశారు. 
 
వేదికపై మోహన్ బాబు మాట్లాడుతుండగా ఫోన్ చూస్తున్నావా? అసలు కామన్ సెన్స్ వుండాలి కదా అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో అలీ ఫోన్ లోపల పెట్టి భార్య కాల్ చేసిందని సరదాగా అన్నారు. అందుకు మోహన్ బాబు నీకేనా పెళ్లాం వుండేది మాకంతా లేరా అంటూ సరదాగా అన్నారు. 
 
అంతేగాకుండా నీపై అనుమానం కాబట్టే ఫంక్షన్‌లో వున్నావా లేకుంటే బయట తిరుగుతున్నావా అనే అనుమానంతో కాల్ చేసి వుంటారని మోహన్ బాబు అనడంతో వేదికలోని అందరూ నవ్వేశారు. 
 
రాత్రుల్లో తిరుగుతావ్ కాబట్టి అనుమానంతో ఫోన్ చేసిందని మోహన్ బాబు అన్నారు. మాట్లాడేటప్పుడు డిస్టబ్ చేస్తావయ్యా అంటూ తన స్పీచ్ ప్రారంభించారు. ఇదంతా సన్నాఫ్ ఇండియా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఇదంతా జరిగింది.