సంబంధిత వార్తలు
- అత్తారింటిలో వరకట్నం వేధింపులు.. పుట్టింటికి భార్య.. భర్త రెండో పెళ్లి?
- ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, గర్భవతినయ్యానని చెబితే పంచాయతీ పెట్టాడు, ఆ తర్వాత?
- భర్తతో గొడవపడి ప్రియుడితో వచ్చేసిన వివాహిత, గంజాయి బిజినెస్ పెట్టి....
- మద్యంమత్తులో భార్యను కొట్టి చంపిన భర్త
- ఆమె అనవసరంగా తన భర్తను హత్య చేసింది, ప్రియుడు వాంగ్మూలం
భార్యలో మార్పు వస్తుందని పుట్టింటికి పంపిస్తే...
భార్య వివాహేతర సంబంధం తెలిసింది. దీంతో బిడ్డతో పాటు ఆమెను పుట్టింటికి పంపాడు. కొన్నిరోజులు గడిస్తే ఆమెలో మార్పు వస్తుందని భావించాడు. అలా కాలేదు కదా ఏకంగా ప్రియుడినే పుట్టింటికి పిలిపించుకుంది. చివరకి...
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామానికి చెందిన వెంకటరమణ, రామభద్రాపురం మండలం కొండపాలవలసకు చెందిన లలితకుమారికి 2015లో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. భర్త, పిల్లాడితో హాయిగా సాగిపోతున్న కుటుంబంలో బాలు అనే యువకుడు ప్రవేశించాడు.
దీంతో వారి జీవితం పూర్తిగా మారిపోయింది. ఆరు నెలల పాటు అతడితో సన్నిహత సంబంధం కొనసాగించింది. ఎక్కువరోజులు అది సాధ్యం కాదు కదా..అడ్డంగా దొరికిపోయింది. అయితే భర్త హెచ్చరించాడు. తప్పని చెప్పాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో పుట్టింటికి పంపాడు. అయితే అక్కడ కూడా ప్రియుడిని పిలిపించుకుంది. విషయం తెలుసుకున్న భర్త తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
ప్రాణంగా భావించే భార్యే ఈ విధంగా చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను లేఖ కూడా రాశాడు. ప్రస్తుతం ఆ లేఖ పోలీసుల అదుపులో ఉంది.
