1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (18:00 IST)

కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్

Chamber comity report
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబందించిన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి త‌మ అనుబంధ శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో అత్య‌వ‌స‌ర స‌మావేశం జ‌రిపి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ - 24 క్రాఫ్ట్స్ మరియు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ వారు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయములను చర్చించుటకు హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో 20-02-2022వ తేదీన శ్రీ ఘట్టమనేని ఆదిశేషగిరి రావు గారి అధ్యక్షతన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో సమావేశం జరుపదమైనది.  
 
ఈ సమావేశములో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆఫీస్ బేరర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫీస్ బేరర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ఆఫీస్ బేరర్స్ మరియు ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రముఖులు, సినీ ఆర్టిస్టులు, డైరెక్టర్స్, ఎగ్జిబిటర్స్ , ప్రొడ్యూసర్స్, స్టూడియోస్, డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఫెడరేషన్ కు సంభందించిన సభ్యులు పాల్గొన్నారు. 
ఈ సమావేశంలో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో వున్న అడ్మిషన్ రేట్స్ మీద  ఇచ్చిన జి.ఓ.లను ఏవిధముగా అమలుపరచాలనే విధానం మీద డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ వారి నియమ నిబంధనలు, ఫిలిం ట్రైలర్స్ , పబ్లిసిటీ ఛార్జెస్ , విపియఫ్ ఛార్జెస్, ఆన్లైన్ టిక్కెటింగ్ నడుపుతున్న సంస్థల మీద, వారి విధి విధానాలు, పర్సెంటేజ్ విధానం , ఓటిటి విధానం పలు విషయాల మీద అందరం ఒక త్రాటి మీద ఉండి పలు అంశాలపై సానుకూలంగా పరిష్కరించుకొనుటకు ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించడమైనది. 
 
అన్ని సెక్టార్స్ కు సంబంధించిన విషయములను, ముఖ్యముగా చిన్న సినిమాలు మరింత మనుగడ సాధించుటకు అందరం ఏకాభిప్రాయంతో ఉండి ఒక చిత్త శుద్ధితో ముందుకు వెళ్లాలని అనుకోవటం జరిగింది.  పరిశ్రమకు సంబంధించిన అన్ని విషయములను ఏక తాటిపై ఉండి తగిన చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా ఉండి అవన్నియు సాధించాలని ఆవిధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం జరిగింది.  దీని మీద చిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయముల మీద ఫిలిం ఛాంబర్ వారు ఒక హై లెవెల్ సబ్ కమిటీ నియమించి పైన పేర్కొన్న అంశాల మీద చర్చించి తగు నిర్ణయాలను తీసుకొని అవి ఏవిధంగా అవలంబించాలనే దాని మీద తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. 
 
ఆలాగే  తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఏ విషయమునైనను ఫిలిం ఇండస్ట్రీకి పేరెంట్ బాడీ అయినా తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ద్వారా చర్చించి ఆవిధంగా తగు నిర్ణయమును తీసుకొని ముందడుగు వేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 
 
(నారాయణ్ దాస్ కిషన్ దాస్ నారంగ్ ) 
అధ్యక్షులు         
 
(కె.ఎల్. దామోదర్ ప్రసాద్) (యం . రమేష్ )
కార్యదర్శులు