గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (11:34 IST)

పుట్టింటికి చేరిన ఎయిరిండియా.. నేటి నుంచి సర్వీసులు ప్రారంభం

ఎయిర్ఇండియాను తిరిగి టాటా గ్రూప్​కు అప్పగించింది కేంద్రం. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఈ విమానయాన సంస్థ తన పుట్టింటికి చేరింది. 89ఏళ్ల కిందట వారు స్థాపించిన ఈ కంపెనీ.. 68ఏళ్లు తమకు దూరంగా ప్రభుత్వం చేతిలో ఉంది. మళ్లీ ఇన్నాళ్లకు పూర్తిగా టాటాల అధీనంలోకి వెళ్లింది.  విమానయాన సంస్థ ఎయిర్ ​ఇండియాను టాటా గ్రూప్​ చేతికి అప్పగించింది కేంద్రం. 
 
దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియను గురువారం పూర్తి చేసింది. ఎయిర్​ఇండియాలోని 100శాతం వాటాను టాటా గ్రూప్‌కు చెందిన లాటెస్​ ప్రైవేట్ లిమిటెడ్​కు బదిలీ చేసింది. దీంతో శుక్రవారం నుంచి ఎయిరిండియా నిర్వహణ, నియంత్రణ పూర్తిగా టాటా గ్రూప్​ చేతిలోనే ఉండనుంది.