గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (11:03 IST)

అత్తారింటిని నుంచి పుట్టింటికి చేరిన ఎయిర్ ఇండియా.. టాటా స్వాగత సందేశమిదే...

ఎయిర్ ఇండియా సంస్థ ఈ నెల 26వ తేదీ వరకు ప్రభుత్వ రంగ ఉన్నది. ఇపుడు టాటా గ్రూపు చేతుల్లోకి వెళ్లిపోయింది. నిజానికి దాదాపు ఏడు దశాబ్దాల (69 యేళ్ల క్రితం) క్రితం ఎయిర్ ఇండియాను టాటా సంస్థ ప్రారంభించింది. ఆ తర్వాత దీన్ని కేంద్రం స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి నష్టాలు, లాభాలు అనే రెండు రెక్కలతో ప్రయాణికులకు సేవలు అందిస్తూ వచ్చింది. 
 
కానీ, నష్టాల నుంచి గట్టెక్కే సూచనలు లేకపోవడంతో ఈ సంస్థను కేంద్రం అమ్మకానికి పెట్టగా, తిరిగి టాటా గ్రూపు దక్కించుకుంది. మొత్తం రూ.18 వేల కోట్ల వ్యయంతో టాటా గ్రూపు బిడ్ వేసి ఎయిర్ ఇండియాను సొంతం చేసుకుంది. దీంతో అత్తారిల్లు (కేంద్రం) నుంచి పుట్టినిల్లు (టాటా)కి ఎయిర్ ఇండియా చేరింది. ఈ ప్రక్రియ గురువారం ముగింది. 
 
ఆ తర్వాత ఎయిర్ ఇండియా పేరు మారిపోయింది. ఎయిర్ ఇండియా ఇపుడు టాటా ఎయిర్ ఇండియాగా మారింది. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా కాక్‌పిట్ క్రూ వెల్‌కమ్ అనౌన్స్‌మెంట్ కోసం ఓ సర్క్యులర్‌ను జారీచేసింది. "వెల్‌కమ్ టు ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, వియ్ హోప్ యూ ఎంజాయ్‌ ది జర్నీ" అంటూ సందేశాన్ని రూపొందించిది. "ప్రియమైన అతిథులారా.. మీ కెప్టెన్ మాట్లాడుతున్నారు. ఈ చారిత్రాత్మక విమానానికి స్వాగతం. ఇది మీకు ఒక ప్రత్యేకమైన ప్రయాణం" అనే అనౌన్స్‌మెంట్‌ను వినిపించారు.