సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (18:47 IST)

ఎయిర్ ఇండియా విమానంలో కరోనా: 125 మందికి పాజిటివ్

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో ఎయిర్ ఇండియాలో కోవిడ్ కలకలం రేపింది. అలాగే విదేశాల నుంచి వ‌చ్చిన వారి ద్వారా దేశంలోకి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఇట‌లీ నుంచి పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌కి వ‌చ్చిన ఎయిర్ ఇండియా విమానంలో క‌రోనా క‌ల‌క‌లం రేగింది.  ఇట‌లీ నుంచి అమృత్ స‌ర్ కు ఎయిర్ ఇండియా విమానంలో వ‌చ్చిన 125 మందికి క‌రోనా సోకింది.  దీంతో వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపారు.  ప్ర‌స్తుతం 125 మంది ప్ర‌యాణికుల‌ను ఐసోలేష‌న్‌లో ఉంచిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు.