గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (17:44 IST)

టాలీవుడ్‌ దర్శకుల మధ్య ట్విట్టర్ వార్.. అసలేమైంది.?

టాలీవుడ్‌లోని దర్శకులు ఎప్పుడూ ఐక్యంగా ఉంటారు. అయితే తాజాగా బీవీఎస్ రవి, హరీష్ శంకర్‌ల ట్విట్టర్ వార్ చూస్తుంటే వారి మధ్య కొన్ని విభేదాలున్నాయని అర్థమవుతోంది. గత రాత్రి రవి ఒక ట్వీట్ చేశాడు. 
 
ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినట్టుగా అన్పిస్తోంది. అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయo చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోందని రవి ట్వీట్ చేశాడు. 
 
అయితే ఈ ట్వీట్ ఇద్దరి మధ్య రచ్చకు కారణమైంది. వెంటనే ఈ ట్వీట్‌కు హరీష్ శంకర్ స్పందిస్తూ "అనుభవించమని ఇచ్చారా ?" అని ప్రశ్నించాడు. అలా స్టార్ట్ అయ్యి, నిన్న రాత్రి నుంచి ఇప్పటికీ వీరిద్దరి మధ్య జరుగుతున్న ట్విట్టర్ రచ్చ జరుగుతూనే వుంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.