శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 మార్చి 2022 (16:45 IST)

రైలుకి అగ్నిప్రమాదం: బోగీలను నెట్టుకుని వెళ్లిన ప్రయాణికులు-Video

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ దౌరాలా రైల్వే స్టేషనులో ఆగి వున్న ప్యాసింజరు రైలు అగ్నిప్రమాదానికి గురైంది. ఐతే రైలు స్టేషనులో ఆగి వుండటం వల్ల ప్రాణనష్టం తప్పింది. ఐతే రైలు బోగీకి నిప్పంటుకుని మిగిలిన బోగీలు కూడా దగ్ధమవ్వడం ప్రారంభమైంది.

 
దీనితో ప్రయాణికులంతా మూకుమ్మడిగా నిప్పు అంటుకున్న రైలు బోగీలను వేరు చేసి మిగిలిన రైలు బోగీలను పట్టాలపై నెట్టుకుంటూ వెళ్లారు. ఆ బోగీలన్నిటినీ అలా ప్రయాణికులే నెట్టుకుంటూ వెళ్లడాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి షేర్ చేసాడు. దీన్ని చూసిన నెటిజన్లు శభాష్ అంటూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.