గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (08:26 IST)

పెళ్లి శుభకార్యంలో విషాదం - 11 మంది మృత్యువాత

ఉత్తర్పరదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన జరిగింది ప్రమాదవశాత్తు బావిలో పడి కనీసం 11 మంది వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో చోటుచేసుకుంది. 
 
ప్రాథమిక సమాచారం మేరకు హల్దీ వేడుకలో మహిళలు, బాలికల భారీగా పాల్గొన్నారు. ఆ సమయంలో బావి చుట్టూ రెయిలింగ్ పై కూర్చొని ఉండగా, అది ఒక్కసారి కూలిపోయింది. దీంతో దానిపైన కూర్చొన్న వారంతా బావిలో పడిపోయారు. 
 
బావిలో మునిగి 11 మంది మహిళలు మృతి చెందగా గ్రామస్తులు, పోలీసులు 15 మంది మహిళలను రక్షించారు. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు.