అలాంటి వాడే జీవిత భాగస్వామి : రష్మిక మందన్నా
తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్న భామ రష్మిక మందన్నా. భాషతో నిమిత్తం లేకుండా దక్షిణాది చిత్రసీమను ఏలేస్తుంది. తెలుగు, తమిళం, కన్నడం ఇలా అన్ని భాషల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా ఉన్నారు. తాజాగా ఆమె హీరో శర్వానంద్‌తో కలిసి నటించిన "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
తాజాగా జరిగిన ఈ చిత్రం ప్రమోషన్ వేడుకలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, "ఎవరి దగ్గర అయితే సెక్యూర్‌గా ఫీల్ అవుతామో, కంఫర్ట్‌గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ స్నేహంగా ఉంటాం అనిపస్తుందో అతడే జీవితానికి మంచి లైఫ్ పార్టనర్. అలాంటి వాడినే భర్తగా ఎంచుకుంటాను అని చెప్పుకొచ్చింది.
ఇక ప్రేమ పెళ్లిపై ఆమె స్పందిస్తూ, ఇద్దరు వ్యక్తులు మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నపుడు మాత్రమే అది ప్రేమ అవుతుంది. అలాకాకుండా, ఒకరు అర్థం చేసుకోలేనపుడు అది వన్ సైడ్ లవ్‌గానే మిగిలిపోతుంది అని చెప్పారు.
కాగా, హీరో విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, వీటిపై వీరిద్దరూ నోరు విప్పడం లేదు. ఈ క్రమంలో రష్మిక చేసిన ప్రేమ పెళ్లి కామెంట్స్‌తో ఆమె ప్రేమ పెళ్లి చేసుకుంటారని చెప్పకనే చెప్పారు.