'రాధేశ్యామ్'కు మిశ్రమ స్పందన - ప్రభాస్ అభిమాని ఆత్మహత్య
ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వచ్చిన "రాధేశ్యామ్" చిత్రం. ఈ నెల 12వ తేదీన పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజైంది. అయితే, ఈ చిత్రానికి మిశ్రమ టాక్ వచ్చింది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. తొలి రోజున ఈ చిత్ర ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.79 కోట్లను హైయ్యర్ గ్రాస్‌ను వసూలు చేసి గతంలో ఉన్న పుష్ప సినిమా రికార్డను బ్రేక్ చేసింది.
అయితే, చిత్రానికి మిశ్రమ టాక్ రావడాన్ని ప్రభాస్ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఏపీలోని కర్నూలు పట్టణంలోని తిలక్ నగర్‌కు చెందిన రవితేజ (24) అనే అభిమాని సినిమా బాగాలేదని వచ్చిన టాక్‌ను జీర్ణించుకోలేకపోయాడు. దీంతో తీవ్ర మనస్తానికిలోనై బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని తన తల్లితో చెప్పిమరీ రవితేజ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రాథమిక ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్ట్రు. కాగా, గతంలో 'రాధేశ్యామ్' అప్డేట్ ఇవ్వడం లేదని కొందరు ప్రభాస్ అభిమానులు ఏకంగా సూసైడ్ నోట్స్ రాసిన విషయం తెల్సిందే.