శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 మార్చి 2022 (10:21 IST)

కడపలో బీజేపీ ‘రాయలసీమ రణభేరి’ సభ

కడపలో బహిరంగ సభకు బీజేపీ సర్వం సిద్ధం చేసింది. కడపలో రాయలసీమ రణభేరి పేరుతో ఈ మధ్నాహ్నం సభ నిర్వహించనున్నారు. కేంద్ర మంతి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పురంధేశ్వరితో సహా రాష్ట్రంలోని బీజేపీ ముఖ్యులంతా కడప సభకు రానున్నారు. 
 
ఈ సభను పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మార్గదర్శకంలో నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా సీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే డిమాండును వినిపించాలని నిర్ణయించారు. 
 
అదే విధంగా.. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతున్నా.. రాయలసీమకు ఎటువంటి లాభం జరగలేదని బీజేపీ నేతలు ఈ సభ ద్వారా ప్రజలకు ఎత్తి చూపేందుకు సిద్ధమయ్యారు.  చెప్పేందకు సిద్దమయ్యారు. సీమ ప్రాంతంలోని సమస్యలను ప్రస్తావించనున్నారు.