గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2022 (11:38 IST)

ప్రధాని మోదీతో జగన్ భేటీ.. నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే?

Jagan_Pm Modi
ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చ జరిపారు. ప్రధాని నివాసంలో ఈ కీలక సమావేశం జరిగింది.  
 
పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ ప్లాంట్, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత, తెలంగాణ డిస్కంల నుంచి రాష్ట్రానికి బకాయిలు తదితర అంశాలపై ప్రధాన మంత్రికి ఏపీ సీఎం జగన్ వినతిపత్రం అందజేశారు.
 
సుమారు గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నివేదించిన అంశాలపట్ల ప్రధాని సానుకూలంగా స్పందించారు.
 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మధ్య ఎలాంటి రిలేషన్‌‌ ఉంటుందో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రా ప్రజలకు వివరించారు. జగన్‌మోహన్ రెడ్డి అంటే ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక అభిమానమని.. ఎప్పుడు కనిపించినా ఒక తండ్రిలా ఆప్యాయంగా పలకరిస్తారన్నారు.  
 
నాసిన్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. 2024 నాటికి నాసిన్ పనులు పూర్తి చేస్తామన్నారు. నాసిన్ ఏర్పాటుకు సహకరిస్తున్న ఏపీ ప్రభుత్వానికి.. భూములిచ్చిన రెండు గ్రామాల రైతులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 
 
అకాడమీ ఏర్పాటుతో పాలసముద్రం, హిందూపురం ప్రాంతాల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పాలసముద్రం గ్రామానికి రూ.729 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.