మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2022 (10:28 IST)

తెలుగు రాష్ట్రాల్లో మరో 15 రోజులు భగభగలే...

temparature
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో పదిహేను రోజుల పాటు సూర్యుడు మరింత ప్రతాపం చూపించనున్నారు. ఈ నెల 15వ తేదీవరకు ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో ఎండలతోపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. 
 
అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉదయం 11 గంటల తర్వాత సాయంత్రం 5 గంటల వరకు అత్యవసరమైతే మినహా బయటకు వెళ్లొద్దని ఆయన కోరారు. అలాగే, అనేక ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అందువల్ల వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 
 
అలాగే, దేశంలోని పలు ప్రాంతాలతో పాటు హిమాలయ పర్వత ప్రాంతాల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇలాంటి వాతావరణంలో ఎడారి ప్రాంతాల్లో కార్చిచ్చు ఏర్పడే అవకాశం ఉందని, అందువల్ల అటవీ శాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు కోరారు.