గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2022 (11:08 IST)

15 రోజులు భానుడు భగ్గుమంటాడు.. తెలుగు రాష్ట్రాలకు ఐఎండి

summer
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లో భానుడు మండిపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఏప్రిల్ తొలి 15 రోజుల్లో భానుడు భగ్గుమంటాడని ఐఎండి తెలిపింది. 
 
పలు ప్రాంతాల్లో ఎండలతో పాటు, వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాలోని ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 మధ్య బయటకు వెళ్లొద్దని వాతావరణ నిపుణుల సూచిస్తున్నారు. 
 
దేశంలో పలు ప్రాంతాలతో పాటు.. హిమాలయ పర్వతాల్లోనూ ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని స్పష్టం చేసింది ఐఎండీ. ఇలాంటి వాతావరణంలో ఎక్కువగా అడవుల్లో కార్చిచ్చు ఏర్పడే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
 
రికార్డ్ బద్దలు: మరో వైపు మార్చి నుంచే మండిపోతున్న ఎండలు దశాబ్దాల రికార్డులను బద్దలు కొడుతున్నాయి. 1901 తర్వాత ఈ మార్చిలో అంటే 122 ఏళ్ల తర్వాత దేశంలో మార్చి నెలలో అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సరాసరి 33.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో 2010లో నమోదైన 33.09 డిగ్రీల రికార్డు చెరిగిపోయింది.