శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (14:47 IST)

'హరిహర వీరమల్లు'లో ఇంటెన్స్ లుక్‌లో పవన్

harihara veeramallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఇటీవలే భీమ్లా నాయక్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ప్ర‌స్తుతం ఈయ‌న నాలుగు సినిమాల‌ను లైన్లో పెట్టాడు. వీటిలో ఒకటి 'హ‌రిహ‌ర వీరమ‌ల్లు'. క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటుంది. 
 
శ్రీరామ న‌వ‌మీ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఈ చిత్రం నుంచి పోస్ట‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. తాజాగా విడుద‌లైన పోస్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటెన్స్ లుక్‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. గతేడాది షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది. 
 
పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఏఎమ్ ర‌త్నం, ద‌యాక‌ర్ రావు నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడిగా నిధి అగ‌ర్వాల్, న‌ర్గీస్ ఫ‌క్రిలు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఎమ్‌.ఎమ్ కీర‌వాణి స్వ‌రాల‌ను సమకూర్చుతున్నారు.