సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2022 (11:15 IST)

టాలీవుడ్ డ్రగ్స్‌ కేసు దర్యాప్తు : జేడీ గోయల్ పదవీకాలం పొడగింపు

drugs
తెలుగు చిత్రపరిశ్రమను ఓ కుదుపు కుదిపిన డ్రగ్స్ కేసును విచారిస్తున్న దర్యాప్తు సంస్థను పర్యవేక్షిస్తున్న జాయింట్ డైరెక్టర్ గోయల్ పదవీకాలాన్ని పొడగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసు దర్యాప్తును ఈడీ చేపట్టిన నాటి నుంచి గోయలే దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన నిందితుల వివరాలను తెలంగాణ ఎక్సైజ్ శాఖ నుంచి స్వాధీనం చేసుకోవడంలో గోయల్ కీలక భూమిక పోషించారు. 
 
ఎక్సైజ్ శాఖ నుంచి సకాలంలో వివరాలు అందని నేపథ్యంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన గోయల్ కోర్టు ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ నుంచి దాదాపుగా పూర్తి ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి క్రమంలో ఆయన పదవీ కాలం ముగిసింది. అయితే, కేసు దర్యాప్తులో ఆటంకం కలగకూడదన్న భావనతో గోయల్ పదవీ కాలాన్ని పొడగిస్తూ ఈడీ కీలక నిర్ణయం తీసుకుంటుంది.