1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By పీఎన్నార్
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (09:27 IST)

కొడుకు ఫంక్షన్‌కు రావడానికి పూరికి టైమ్ లేదా? కడిగిపారేసిన బండ్ల గణేష్

bandla ganesh
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు పూరి ఆకాష్ నటించిన కొత్త చిత్రం "చోర్ బజార్". ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్‌పై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మనం బతికేది పిల్లల కోసం. రేపు మనం చస్తే తల కొరివి పెట్టేది ఆ పిల్లలే. వారి సుఖ సంతోషాల్లో పాలు పంచుకోకపోతే ఎందుకంటూ నిలదీశారు. 
 
ఈ వేడుకలో ఆయన ప్రసంగిస్తూ, పూరి జగన్నాథ్ స్టార్ పిల్లలను మెగాస్టార్‌లుగా, సూపర్‌స్టార్‌లుగా మార్చారని, డ్యాన్స్ చేయడం, డైలాగ్‌లు చెప్పడం తెలియని వారికి డైలాగులు నేర్పించి సూపర్‌స్టార్‌లను చేశారు. కానీ, తన సొంత కుమారుడి కార్యక్రమానికి హాజరుకావడానికి ఆయనకు సమయం లేదా అంటూ నిలదీశారు. 
 
పూరి జగన్నాధ్ ముంబైలో షూటింగ్‌లో బిజీగా ఉన్నందున తన కొడుకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎగ్గొట్టాడు. ఇప్పుడు బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మరియు మెగాస్టార్ అభిమానుల మధ్య చర్చకు దారితీశాయి. పూరి జగన్నాథ్ ప్రేమకథను కూడా బండ్ల గణేష్ ఈ సందర్భంగా బయటపెట్టారు. 'చోర్ బజార్' జూన్ 24న విడుదలకానుంది.