గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 9 మే 2022 (10:49 IST)

విజయ్ దేవరకొండ పై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసిన పూరీ, స‌మంత‌!

Vijay Devarakonda, Puri Jagannadh
Vijay Devarakonda, Puri Jagannadh
చిన్న చిన్న పాత్ర‌లు వేసిన నాటి నుండి ఇప్పుడు 11వ సినిమాగా పాన్ ఇండియా సినిమా చేస్తూ దేశంలో చెప్పుకోదగిన హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ పై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు పూరీ, స‌మంత‌. మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న క‌శ్మీర్‌లో షూట్‌లో వున్నారు. మైత్రీమూవీస్ మేక‌ర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శివ నిర్వాణ ద‌ర్శ‌కుడు. ఇంత‌కుముందు మజిలీ, నిన్ను కోరి చిత్రాలు తీసిన ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. కాగా, మే8వ తేదీ రాత్రినాడే క‌శ్మీర్‌లో విజ‌య్‌దేవ‌ర‌కొండ పుట్టిన‌రోజును నిరాడంబ‌రంగా జ‌రిపారు. చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన ర‌వి కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స‌మంత ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేస్తూ, విజయ్ దేవరకొండ తో క‌లిసి న‌టిస్తాన‌ని అస్స‌లు అనుకోలేదు. చాలా ఎన‌ర్జీ హీరో అంటూ కితాబిచ్చింది.
 
Ravi, Samantha, Vijay Devarakonda, Shiva Nirvana
Ravi, Samantha, Vijay Devarakonda, Shiva Nirvana
ఇక ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ఇప్ప‌టికే `లైగ‌ర్‌` సినిమా చేశాడు. త్వ‌ర‌లో విడుద‌ల‌కానుంది. పూరీ త‌న మాట‌ల‌తో విజ‌య్‌ను ఆక‌ట్టుకున్నాడు. నీగుండెలో ఫైర్ చేను గ‌మ‌నించాను. న‌టుడిగా త‌ప‌న నీలో నేను చూశాను. నీ మైండ్‌లో ఏముందో నేను తెలుసుకోగ‌లిగాను. నీ ఆక‌లి, నీ మాడ్‌నెస్ నీ క‌మిట్‌మెంట్, నీ స‌హృద‌యం అన్నీ క‌లిపి దేశం గ‌ర్వించే న‌టుడు అవుతావు. అంద‌రూ నీ గురించే మాట్లాడుకుంటార‌ని.. ఎమోష‌న‌ల్ ట్వీట్ ఇచ్చాడు. దాంతో విజ‌య్ ఫిదా అయిపోయాడు.