గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 3 మే 2022 (18:42 IST)

రికార్డ్ స్థాయిలో లైగ‌ర్ వ్యాపారం

Vijay Devarakonda
Vijay Devarakonda
విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్‌గా న‌టించిన లైగ‌ర్ సినిమా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఒరిజిన‌ల్ బాక్స‌ర్ మైక్ టైస‌న్ ఇందులో చేర‌డంతో చిత్రంపై క్రేజీ ఏర్ప‌డింది. అందుకే సినిమా ఆడియోను 14 కోట్ల‌తో సోనీ సంస్థ కొనుగోలుచేసింది. అన్ని భాష‌ల్లో సోనీ సంస్థ తీసుకున్న హ‌క్కులు హాట్ టాపిక్‌గా మారాయి.  అయితే ఈ సినిమాకి సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది ఇంకా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌లేదు.
 
అదేవిధంగా సినిమాకు కూడా భారీగా మార్కెటింగ్ జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. వంద‌ల కోట్ల‌తో ఓ ప్ర‌ముఖ సంస్థ ముందుకు వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డి కానున్నాయి.  ఈ సినిమాకి ఛార్మి, ధర్మ ప్రొడక్షన్స్  నిర్మిస్తోంది.