శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (15:05 IST)

సోషల్ మీడియాలో సమంత ఎమోషనల్ పోస్టు.. మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా..?

Samantha
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో భావోద్వేగ భరితమైన పోస్ట్ పెట్టింది. ఏప్రిల్ 28వ తేదీ సమంత పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వారికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.   
 
ఇంకా ఆమె తన సోషల్ మీడియాలో "నా పుట్టినరోజు నాడు మీరు చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం, స్ఫూర్తి, సానుకూలతలకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినే. 
 
మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. ఈ ఏడాదిని మరింత ధైర్యంగా ఎదుర్కొనేందుకు మీరంతా నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపారు" అని సమంత పేర్కొంది. 
 
ఇకపోతే..  చైతుతో ఉన్న బంధాన్ని తలుచుకోకుండా ముందుకు సాగిపోతుంది. పైగా ప్రతి ఒక్క పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‌లో డీ గ్లామర్ లుక్‌తో కుర్రాళ్లను ఎంతో ఫిదా చేసింది.
 
ఇక ప్రస్తుతం సమంత వరస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటోంది. గతంలో తాను నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ సిద్ధంగా ఉంది.