గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (19:20 IST)

చైతూ కాదు.. నేను కూడా రెండో పెళ్లికి రెడీ.. అలాంటి వ్యక్తి దొరకాలి..?

Samantha,
టాలీవుడ్ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత ఆయనకు విడాకులిచ్చింది. ప్రస్తుతం సింగిల్‌గా వుంది. అయితే చైతూ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వచ్చేసింది. దీంతో సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 
 
అంతేగాకుండా సమంతని రెండవ పెళ్లి చేసుకోమని గత కొద్దీ రోజుల నుండి ఆమె ఇంట్లో వాళ్ళు తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారని తెలుస్తోంది. జీవితంలో ఆమెకు తోడు తప్పనిసరిగా అవసరమని.. విడాకులు అయ్యినంత మాత్రాన జీవితం అక్కడే ఆగిపోకూడదు అని సమంత తల్లి తండ్రులు ఆమెని ఒత్తిడికి గురి చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేగాకుండా తల్లిదండ్రులు తనపట్ల ఆందోళన వ్యక్తం చేయడంతో రెండో పెళ్లి చేసుకుంటానని సమంత మాటిచ్చినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. 
 
కానీ ఇప్పుడు తన ఫోకస్ మొత్తం కెరీర్ మీదనే ఉంది అని.. తనకు కొంత సమయం కావాలని అడిగిందట సమంత. ఈసారి పెళ్లి నిర్ణయం ఆమె పూర్తిగా తల్లితండ్రులకే అప్పగించిందట. అంతేగాకుండా తన వ్యక్తిగత జీవితానికి, తన కెరీర్‌కి గౌరవం ఇచ్చి తనని అర్థం చేసుకునే అబ్బాయి రాబోయే రోజుల్లో దొరికితే కచ్చితంగా ప్రేమించే పెళ్లి చేసుకుంటానని సమంత ఆమె తల్లిదండ్రులతో చెప్పినట్లు కోలీవుడ్ టాక్. మరి సమంతను రెండో పెళ్లి చేసుకునే వ్యక్తి ఎక్కడున్నాడో తెలియాలంటే.. కొంత కాలం ఆగాల్సిందే.