శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (18:49 IST)

నాగచైతన్య రెండో పెళ్లి.. ఇద్దరికీ ఒకే వేదికపై డుం.. డుం.. డుం..

Samantha
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు విడాకులిచ్చిన తర్వాత నాగచైతన్య రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే  అఖిల్‌కు కూడా పెళ్లి చేసేయాలని అక్కినేని నాగార్జున డిసైడ్ అయినట్లు సమాచారం. 
 
మరోవైపు నాగచైతన్య  ఓ హీరోయిన్‌తో మళ్లీ లవ్‌లో పడినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం నాగ్‌ వరకు వెళ్లిందట. చైతూ తన లవ్‌కు కన్‌ఫామ్ చేసేస్తే అఖిల్‌తో పాటు అతనికి కూడా పెళ్లి చేసేస్తాను అని నాగార్జున అంటున్నారని గాసిప్స్ వస్తున్నాయి.
 
అయితే ఇవి కేవలం రూమర్స్‌ మాత్రమేనని అక్కినేని ఫ్యామిలీ సన్నిహితంగా ఉండేవారు చెప్పుకొస్తున్నారు. నాగచైతన్య , అఖిల్ ప్రస్తుతం తమ కెరీర్స్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టారని, కాబట్టి ఈ రూమర్స్‌ను లైట్ తీసుకోమంటున్నారు. 
 
బంగార్రాజు తర్వాత నాగ చైతన్య థ్యాంక్యూ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక అఖిల్ ప్రస్తుతం "ఏజెంట్" మూవీ చేస్తున్నాడు. ఆగస్ట్‌లో ఈ చిత్రం విడుదల కాబోతుంది.