గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 18 ఏప్రియల్ 2022 (22:00 IST)

నాగచైతన్య రెండో పెళ్లిపై అక్కినేని కాంపౌండ్ క్లారిటీ... ఏంటంటే?

Naga Chaitanya
అక్కినేని నాగచైతన్య- సమంత విడాకులు తీసుకున్నప్పటికీ వారి గురించి చర్చ మాత్రం ఆగటంలేదు. ఆమధ్య సమంత గురించి ఏవేవో ఊహాగానాలు వినిపించాయి. ఇక తాజాగా నాగ చైతన్య గురించి ఓ వార్త హల్చల్ చేస్తుంది.

 
నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమైపోయాడనీ, తమన్నాను చేసుకుంటాడంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఐతే ఇందులో ఎలాంటి నిజం లేదని అక్కినేని కుటుంబం కొట్టిపారేసింది. నాగచైతన్య పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలనీ, ఇలాంటి గాలి వార్తలను ఎవరు సృష్టిస్తున్నారో తమకు అర్థం కావడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

 
కాగా నాగచైతన్య వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా వున్నారు. అలాగే సమంత సైతం అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీల్లో బిజీగా వుంది.