సమంత నెగెటివ్ పాత్ర చేయనుందా! (video)
Samantha
ఇదిలా వుండగా, నేడు సమంత ప్రభు పుట్టినరోజు సందర్భంగా ఆమెను చిత్ర ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓబేబీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్` ది ఫ్యామిలీ మ్యాన్`లో తమిళ రెబల్ రాజీగా భిన్నమైన పాత్రలు పోషించింది. అయితే 2012 హిందీ చిత్రం `ఏక్ దీవానా థా`లో ఆమె అతిధి పాత్ర పోషించింది. కానీ చాలా మంది చిత్రాన్ని చూడలేదు. కాబట్టి ది ఫ్యామిలీ మ్యాన్ హిందీ సినిమానే మొదటిగా అందరూ అనుకుంటున్నారు. తాజాగా ఆమె నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రను పోషించడానికి సిద్ధమే అని ప్రకటించింది. ఆ పాత్ర ఏ సినిమాలో వుండబోతుందో కొద్దిరోజుల్లో తెలియనుంది.
