గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2022 (22:18 IST)

సుమక్క కోసం రంగంలోకి దిగిన టాలీవుడ్.. ప్రిరిలీజ్ ఈవెంట్‌కు ఇద్దరు సోగ్గాళ్లు

jayamma panchayathi pre release event
బుల్లితెర యాంకర్ సుమ రాజీవ్ కనకలా. సుధీర్ఘకాలంగా బుల్లితెరపై మెరుస్తుంది. తన మాటల మాయాజాలంతో అనేక సినిమా ఈవెంట్లకు యాంకరింగ్ చేస్తూ సినీ జగత్తును మెప్పించారు. మెప్పిస్తున్నారు. ఆమెకు అనేక సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరించారు. మరికొందరు బలవంతం చేస్తే మాత్రం గెస్ట్ అప్పీరెన్స్ పాత్రల్లో కనిపించారు. 
 
అలాంటి చిత్రాల్లో వర్షం, ఢీ, బాద్‌షా ఓ బేబీ చిత్రాల్లో సుమ చిన్నచిన్న పాత్రలను చేశారు. అయితే, గతంలో ఎపుడో ఓ చిత్రంలో సుమ హీరోయిన్‌గా నటించారు. ఇపుడు పూర్తి స్థాయిలో "జయమ్మ పంచాయతీ" పేరుతో తెరకెక్కిన చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల కోసం టాలీవుడ్ అగ్ర నటులంతా తరలివచ్చారు. 
 
దర్శకదిగ్గజం రాజమౌళి మొదలుకుని పవన్ కళ్యాణ్, నాని, రానా, ఇలా అనేక మంది స్టార్స్ వచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని దసపల్లా కన్వెన్షన్ సెంటరులో జరిగే ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు సోగ్గాళ్లు ప్రత్యేక అతిథులుగా విచ్చేసి కార్యక్రమానికి మరింత అందం తీసుకొచ్చారు.