శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2022 (16:03 IST)

ప్ర‌భాస్ స‌మాచారం కోస‌మే ఓ టీమ్ ఏర్పాటు

Prabhas-twitter
Prabhas-twitter
రెబల్ స్టార్ ప్రభాస్  సంబంధించిన ఏ విషయమైనా ఎలాంటి సమాచారం అయినా మా నుంచి మీకు అందుతుంది- అంటూ ప్రభాస్  పిఆర్ టీం తెలియ‌జేస్తూ ప్ర‌క‌ట‌న ఇచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌భాస్ సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్ పేరుతో ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అవేవీ నిజంకాద‌ని ఆ టీమ్ తెలియ‌జేస్తుంది. అంతేకాకుండా ప్ర‌భాస్‌గారి సంబంధించిన ఏ విష‌యాన్ని రాసిని లేటెస్ట్ స్టిల్స్‌నే వాడండి అంటూ సూచ‌న చేయ‌డం విశేషం. 
 
ప్రభాస్ గారి సినిమాలకు సంబంధించిన అధికారిక సమాచారం ఆ సినిమా పి అర్ ఓ నుంచి లేక ప్ర‌భాస్ పి.ఆర్‌. టీమ్ నుంచి మీరు తీసుకోవచ్చు. దయచేసి ప్రభాస్ గారికి సంభందించిన న్యూస్ వేసేటప్పుడు రీసెంట్ ఫొటోస్ మాత్రమే ఉపయోగించవల్సిందిగా కోరుతున్నాము అంటూ వారు తెలియ‌జేస్తున్నారు.