సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (22:22 IST)

కేజీఎఫ్-3లో యష్, బాహుబలి.. ఎక్కడ నుంచి మొదలవుతుందో..? (video)

Yash_Prabhas
Yash_Prabhas
రెబల్ స్టార్ ప్రభాస్, యష్‌లు పాన్ ఇండియా స్టార్లు. అంతేగాకుండా టాలీవుడ్ శాండిల్ వుడ్‌లో బిగ్గెస్ట్ స్టార్స్. కెజిఎఫ్, బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్సును సంపాదించుకున్నారు. అలాంటి ఈ స్టార్లు ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా వుంటుంది. అవును.. యష్, బాహుబలి ఫ్యాన్సుకు ఇది గుడ్ న్యూసేనని చెప్పాలి. యష్ ప్రభాస్‌కు బిగ్ ఫ్యాన్ అనే విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ప్రభాస్, యష్ కలిసి కేజీఎఫ్-3లో కనిపిస్తారనే వార్త ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఫిలిమ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల విడుదలైన కెజిఎఫ్-2 సక్సెస్‌లో తేలియాడుతున్నాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద మంచి బిజినెస్ చేస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో కలిసి మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 
 
అంతేగాకుండా కేజీఎఫ్ 3పై కూడా కన్నేశాడు. ఈ కేజీఎఫ్ 3 పట్టాలెక్కేందుకు సంవత్సరం పడుతుందని కూడా ధ్రువీకరించాడు. వీటన్నింటి మధ్య రెబల్ స్టార్ ప్రభాస్ కేజీఎఫ్-3లో నటించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. యష్ కెజిఎఫ్-3లో ప్రభాస్ బహుశా అతిథి పాత్రలో కనిపిస్తాడని రూమర్స్ వస్తున్నాయి.
 
యష్ యొక్క కెజిఎఫ్-3పై ఫ్యాన్సు మధ్య భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాపై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కేజీఎఫ్-3 ప్రభాస్, యశ్ కాంబినేషన్‌లో వస్తే ఆ సినిమా కలెక్షన్లు బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తాయి.  
 
ఈ నేపథ్యంలో యశ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'కేజీఎఫ్ 2' కోసం నేను .. ప్రశాంత్ నీల్ కొన్ని సీన్స్ అనుకున్నాము. అయితే కొన్ని కారణాల వలన, ఆ సన్నివేశాలను సెకండ్ పార్టులో ఎగ్జిక్యూట్ చేయలేకపోయాము. ఆ సన్నివేశాలన్నీ కూడా పార్టు 3లో రూపుదిద్దుకుంటాయి. సెకండ్ పార్టుకు మించి థర్డ్ పార్టు ఉంటుందనీ, సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది" అని చెప్పుకొచ్చాడు. 
 
అయితే 'కేజీఎఫ్ 2'లో తాను కూడబెట్టిన బంగారమంతా తీసుకుని షిప్పులో సముద్రంలోకి వెళ్లిన రాకీ భాయ్ అక్కడ చనిపోయినట్టుగా చూపించారు. అంతకుముందే అతని భార్య కూడా అధీర కారణంగా ప్రాణాలు కోల్పోతుంది. దాంతో ఇప్పుడు 'కేజీఎఫ్ 3' ఎక్కడి నుంచి మొదలవుతుంది? అనే ఆసక్తి అందరిలో మొదలైంది.