బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2022 (14:27 IST)

రాహుల్ సభకు అనుమతి నిరాకరించిన ఓయూ గవర్నింగ్ బాడీ

rahul gandhi
కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆ తర్వాత 7వ తేదీన హైదరాబాద్ నగరానికి రానున్నారు. దీన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు టి కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. 
 
ఈ సభను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయాలని భావించి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వినతిని తిరస్కరిస్తున్నట్టు ఓయూ పాలకమండలి శనివారం ఓ ప్రకటన జారీచేసింది. 
 
మే ఆరో తేదీన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే రాహుల్ గాంధీ అదే రోజున వరంగల్‌లో జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో ఆయన పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఓయూలో కూడా బహిరంగ సభను నిర్వహించేందుకు టీ కాంగ్రెస్ ప్లాన్ చేయగా, అందుకు ఓయూ గవర్నింగ్ బాడీ అనుమతి నిరాకరించింది.