శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జులై 2022 (16:40 IST)

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు క్లారిటీ

telangana assembly
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుదులపై కేంద్ర క్లారిటీ ఇచ్చింది. సీట్ల సంఖ్య పెంచేందుకు 2026 వరకు వేచి ఉండాలని సూచించింది. ఆ తర్వాత ఏపీలో 225, తెలంగాణాలో 153 స్థానాలకు పెంచుకోవచ్చని తెలిపింది. 
 
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా, అసెంబ్లీ స్థానాల పెంపుపై తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల్లో స్పష్టతనిచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని తేల్చి చెప్పింది. విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి ఏపీలో 225, తెలంగాణలో 153 అసెంబ్లీ స్థానాలకు పెంచుకోవచ్చని తెలిపింది. అయితే, అందుకోసం 2026 వరకు వేచి ఉండాలని చెప్పింది. 
 
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సమాధానంతో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచే ప్రక్రియ ప్రారంభం కావాలంటే కనీసం మరో నాలుగేళ్లు ఆగాల్సిందేననే విషయం స్పష్టమవుతోంది.