శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జులై 2022 (13:12 IST)

తెలంగాణాను ముంచెత్తున్న భారీ వర్షాలు - స్కూల్స్‌కు సెలవు

rain
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో అక్కడి వాగులు, వంకలు, చిన్నపాటి నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే అనేక జలాశయాలు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. అదేసమయంలో ఈ భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. అనేక ప్రాంతాల్లో రహదారులు తెగిపోవడంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
 
ముఖ్యంగా, రాష్ట్రంలోన వికారాబాద్, పూడూరు మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించారు. విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా ముందస్తుగా ఈ సెలవులు ప్రటించారు. 
 
మరోవైపు, రాష్ట్రంలోని పలు జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. గండిపేట 12 గేట్లు, హిమాయత్ నగర్ 8 గేట్లను ఎత్తివేసి, దిగువుకు నీళ్లు వదులుతున్నారు. రెండు జలాశయాల నుంచి 12 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలివేశారు. ఫలితంగా అనేక లోతట్టు ప్రాంతాలు నీటి మునిగిపోయాయి. ఈ ప్రాంతాల్లో అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.