గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 జులై 2022 (10:31 IST)

కన్నబిడ్డపై సలసల కాగిన నూనె పోసిన కసాయి తండ్రి

Oils
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ఓ దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నబిడ్డపై సలసల కాగిన వేడి నూనెను ఓ కసాయి తండ్రి పోశాడు. దీంతో ఆ పసిబిడ్డ శరీరం బాగా కాలిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దేవాపూర్‌ గ్రామానికి చెందిన అబ్బూ(13) తల్లిదండ్రులు మద్యానికి బానిసై ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబ పోషణ కోసం నాలుగేళ్లుగా ఆ బాలుడే గ్రామంలో భిక్షాటన చేసి వచ్చిన దాంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. 
 
రెండు రోజుల క్రితం డబ్బులు తీసుకురాలేదు. దీంతో మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తండ్రి ఎండీ ఇస్మాయిల్‌ కుమారుడిని ఇంట్లోనే బంధించాడు. ఆదివారం వేడి నూనెను బాలుడి చేతులపై పోయడంతో నొప్పి భరించలేక కేకలు పెట్టాడు. గమనించిన స్థానికులు బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.