గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 23 జులై 2022 (13:23 IST)

విమానంలో ప్రయాణికుడికి అత్యవసర చికిత్స చేసిన తెలంగాణ గవర్నర్

Governor of Telangana who gave emergency treatment
వారణాసి నుంచి తిరుగు ప్రయాణంలో దిల్లీ మీదుగా హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అస్వస్థతకు గురికావడంతో అదే విమానంలో ప్రయాణిస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.

 
గుండెల్లో నొప్పితోపాటు, ఇతర సమస్యలతో బాధపడుతున్న ఆ ప్రయాణికుడు, విమానం టేకాఫ్ అయిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విమానంలో డాక్టర్లు ఎవరైనా ఉన్నారా అని విమాన సిబ్బంది ప్రయాణికులను అడగ్గా, వెంటనే డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించి, ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు.

 
కాసేపటికి అస్వస్థతను నుంచి కోలుకున్న ప్రయాణికుడు తనకు చికిత్స అందించిన గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు డాక్టర్ తమిళిసై చేస్తున్న ప్రాథమిక చికిత్సను ఫొటోలు తీసి ట్విటర్‌లో షేర్ చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యను చదివారు.