సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 జులై 2022 (10:02 IST)

దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో మంటలు - బోగీ పూర్తిగా దగ్ధం

fire catch
సికింద్రాబాద్‌ నుంచి ఢిల్లీ బయలుదేరిన దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చివరి బోగీలో మంటలు చెలరేగాయి. భువనగిరి దగ్గరలోని పగిడిపల్లి మధ్య శనివారం అర్థరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు చివరి బోగీలో ఈ మంటలు కనిపించాయి. ఇది లగేజీ బోగీ అని రైల్వే అధికారులు తెలిపారు. మంటలను గమనించిన సిబ్బంది డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. 
 
అయితే, చివరి బోగీ కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక దళ సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు.