గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మే 2022 (11:55 IST)

చాంగ్ కింగ్ ఎయిర్‌ పోర్టులో తప్పిన పెను ప్రమాదం

flight catch fire
చైనాలోని చాంగ్ కింగ్ ఎయిర్‌పోర్టులో పెనుప్రమాదం తప్పింది. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విమానం టేకాఫ్‌కు సిద్ధమైన సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. 
 
విమానం నుంచి మంటలు చెలరేగిన సమయంలో అందులో 113 మంది ప్రయాణికులు ఉండగా, వీరంతా సురక్షితంగా ప్రాణాలతో బయపటప్డాడరు. ప్రయాణికులను విమాన సిబ్బంది అత్యవసర మార్గాల ద్వారా కిందకు పంపించారు. అయితే, 25 మందికి గాయాలయ్యాయి.