సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (23:22 IST)

ఎంఎస్‌ ధోని అరుదైన ఘనత.. వికెట్ కీపర్‌గా 100 క్యాచ్‌లు

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో సీఎస్‌కే వికెట్‌ కీపర్‌గా ఎంఎస్‌ ధోని అరుదైన ఘనత అందుకున్నాడు. ఒక సీజన్ మినహా.. ఆరంభం నుంచి సీఎస్కేకు ఆడుతున్న ధోనీ సీఎస్‌కే వికెట్‌ కీపర్‌గా 100 క్యాచ్‌లు అందుకున్నాడు. 
 
అంతేగాక ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ ద్వారా ధోని మరో రికార్డును కూడా అందుకున్నాడు. ధోని తర్వాత ఒకే జట్టుకు ఆడుతున్న జాబితాలో రైనా(సీఎస్‌కే) 98 క్యాచ్‌లతో రెండో స్థానంలో.. కీరన్‌ పొలార్డ్‌( ముంబై ఇండియన్స్‌) 94 క్యాచ్‌లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 
Dhoni 100 catches
 
ఇక ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వృద్దిమాన్‌ సాహా క్యాచ్‌ అందుకోవడం ద్వారా 100 క్యాచ్‌లు సాధించిన ఘనతను అందుకున్నాడు. ఓవరాల్‌గా ధోని ఐపీఎల్‌లో వికెట్‌ కీపర్‌గా 215 మ్యాచ్‌ల్లో 158 డిస్‌మిసిల్స్‌(119 క్యాచ్‌లు, 39 స్టంప్స్‌ ) ఉన్నాయి.