సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (18:02 IST)

ఐపీఎల్-2021: అర్జున్ టెండూల్కర్ అవుట్

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ గాయంతో ఐపీఎల్-2021లో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గత డిసెంబర్‌లో జరిగిన వేలంలో అర్జున్‌ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్‌ కనీస ధర 20 లక్షలకు సొంతం చేసుకుంది. 
 
అయితే అర్జున్‌ ముంబై తరపున ఒక్క మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు. మొత్తంగా ఐపీఎల్ ఆడకుండానే గాయం కారణంగా అర్జున్‌ తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం యూఏఈ నుండి అర్జున్ ఇండియాకి వస్తున్నాడు. 
 
మరోవైపు.. అర్జున్‌ స్థానంలో రైట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ సిమర్‌జీత్‌ సింగ్‌ను తీసుకున్నట్లు ముంబై ఇండియన్స్‌ తన ట్విట్టర్‌లో ప్రకటించింది.