గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (17:35 IST)

కేక్ క‌ట్ చేసిన చార్మి, పూరీ, హ‌గ్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

charmi-puri-vijay
విజయ్ దేవరకొండ తాజా సినిమా `లైగ‌ర్`. గోవాలో షూటింగ్ జ‌రుగుతోంది. ఈరోజు డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా సెట్లో చాక్‌లెట్ కేక్‌ను పూరీ, చార్మి క‌లిసి క‌ట్ చేశారు. ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు తినిపించుకున్నారు. హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం పాన్ ఇండియా సినిమా చేయ‌డానికి కార‌ణ‌మైన పూరీ ఆత్మీయంగా కౌగ‌లించుకుని శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అనంత‌రం ద‌ర్శ‌కుల టీమ్ పూరీ జ‌గ‌న్నాథ్ ఫొటోల‌తో కూడిన బ్రోచ‌ర్‌ను ఆయ‌న‌కు బ‌హూక‌రించారు.
 
puri birthday gova
కాగా, ఈ సినిమాకు `లైగర్`. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్‌లైన్‌. ప్యాన్ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ  సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం లైగర్ చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. కాగా, నిన్న‌నే లైగ‌ర్ చిత్రం ద్వారా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బాక్స‌ర్ మైక్ టైసన్ మొదటి సారిగా ఇండియన్ స్క్రీన్‌కు పరిచయమ‌వున్నారని తెలియ‌జేశారు. ఈ అనౌన్స్‌మెంట్ కి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇండియా వైడ్ గా ట్విట్ట‌ర్ లో ట్రెండ్ అయ్యింది.  బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.