సంబంధిత వార్తలు
- చేపలను తింటున్న మేక.. వీడియో వైరల్
- ''పుష్ప'' షూటింగ్లో ఇరుక్కున్న బన్నీ.. కాకినాడలో సందడి.. తేజ్ యాక్సిడెంట్‌కూ..?
- కింద మంట... కడాయిలో సలసల కాగే వేడినీళ్ళు... సరదాగా కూర్చున్న బుడ్డోడు..
- లంచం తీసుకోనన్న పోలీసు.. ముద్దు పెట్టిన యువతి.. వీడియో వైరల్
- రక్షా బంధన్ : విష సర్పాలకు రాఖీ కడుతూ ప్రాణాలు కోల్పోయాడు..
సీఎస్‌కే విజిల్ పోడు... జీవా అదుర్స్... ధోనీనే విలువైన ఆటగాడు
ఐపీఎల్ 2021లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్, సీఎస్‌కే మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ధోని కూతురు జీవా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సీఎస్‌కే జట్టు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది విజిల్ పోడు.. సెకండ్‌ఫేజ్ ప్రారంభంలో ధోని నాయకత్వంలోని సీఎస్‌కే విజిల్ పోడు అనే అంశాన్ని వీడియో రూపంలో తీసుకొచ్చి తమ ప్రమోషన్‌కు వాడుకుంది. అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్ అయింది.
తాజాగా ధోని కూతురు జీవా కూడా మ్యాచ్ మధ్యలో విజిల్ వేస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. చేతిలో ఈల పట్టుకొని సాక్షిధోని పక్కన నిల్చొని విజిల్ వేస్తూ ఉత్సాహంగా కనిపించింది. జీవా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇకపోతే, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ.. ఐపీఎల్‌లో ఇప్పటికీ అత్యంత విలువైన ఆటగాడిగా కనిపిస్తున్నాడని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్ అన్నాడు. వయసు పైబడుతుంటడంతో ధోనీ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నా.. జట్టులో కెప్టెన్‌గా ఎంతో కీలకంగా ఉన్నాడని పేర్కొన్నాడు.
ఐపీఎల్-14 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఇప్పటికే ఎనిమిది విజయాలు సాధించి 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. గురువారం జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై జట్ల మధ్య జరగనుంది. ఇందులో ధోనీసేన విజయం సాధిస్తే.. అధికారికంగా ప్లే ఆఫ్స్‌కి చేరుతుంది.
