శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (12:53 IST)

కింద మంట... కడాయిలో సలసల కాగే వేడినీళ్ళు... సరదాగా కూర్చున్న బుడ్డోడు..

ఓ కట్టెల పొయ్యిపై పెద్ద కడాయి ఒకదాన్ని పెట్టారు. దాన్ని నిండుగా నీళ్లు పోశారు. దాని కింద కట్టెలతో పెద్ద మంట పెట్టారు. అలా సలసల కాగేనీళ్ళలో ఓ బుడతడు సరదాగా కూర్చొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
నీరు నిండుగా ఉన్న కడాయిలో బాలుడు కూర్చొని ఉండగా కింద మంట పెట్టారు. ఆ కడాయిలో నీరు మరుగుతున్నా.. ఆ బాలుడు ఏమాత్రం చలించకుండా కూర్చొని ఉన్నాడు. దాంతో అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. 
 
ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోకు లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. కొందరు ఈ వీడియోను ఫేక్ అంటున్నారు. ఇది ఒక మ్యాజిక్ ట్రిక్.. జనాలను బుడ్డోడు మోసం చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియా ఇప్పుడు నెట్టింట మరోసారి వైరల్‌గా మారింది