1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Young Boy attempt to Suicide after girls Harassment

అమ్మాయిల వేధింపులు.. పురుగుల మందు తాగిన ల్యాబ్ టెక్నీషియన్

Warangal Young Boy
సాధారణంగా యువకుల వేధింపులు భరించలేక అమ్మాయిలు అత్మహత్యలు చేసుకోవడం సహజం. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అమ్మాయిల వేధింపులు భరించలేని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మొరిపిరాలకు చెందిన సందీప్ మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ముగ్గురు అమ్మాయిలతో పరిచయం అయింది. అందులో ఒకరిపై సందీప్ ప్రేమలో పడ్డాడు.
 
ఇటీవల మిగతా ఇద్దరు యువతులు సందీప్‌కు ఫోన్ చేసి ప్రియురాలు చనిపోయిందని, అందుకు కారణం నువ్వేనంటూ బెదిరించారు. ఈ నెల 12వ తేదీన మరోమారు ఫోన్ చేసిన యువతులు సందీప్‌ను బెదిరించారు. 
 
దీంతో భయపడిపోయిన యువకుడు స్వగ్రామానికి చేరుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
రూ.50 కోట్ల విలువైన వెంకన్న స్థలంపై భూ బకాసురుల కన్ను!