సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 మార్చి 2021 (10:32 IST)

ఎమ్మెల్యేల్లో 68 మందికి నేరచరిత్ర.. వీళ్లంతా ప్రజాప్రతినిధులా..?!

తమిళనాడులో ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 68 మంది అంటే 33 శాతం నేరచరిత్ర కలిగినవారే ననే పోల్‌రైట్స్‌ గ్రూప్‌ ఏడీఆర్‌ తన నివేదికలో పేర్కొంది. ఆయా ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆ నివేదిక తెలియజేసింది. 
 
సిటింగ్‌ ఎమ్మెల్యేలలో 38 మంది అంటే 19 శాతంపై నాన్‌ బెయిలబుల్‌, ఐదేళ్ల జైలు శిక్ష విధించేందుకు ఆస్కారమున్న క్రిమినల్‌ కేసులు ఉన్నాయని సదరు నివేదిక వివరించింది. వీరిలో ప్రతిపక్ష డీఎంకేకు చెందినవారు 40 మంది ఉంటే.. అధికార అన్నాడీఎంకేలో 23 మంది ఉన్నారు.
 
ఇక, కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు, డీఎంకేలో 22 మంది, అన్నాడీఎంకేలో 13 మంది, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 
 
ఇక, ఎనిమిది మందిపై హత్యాయత్నం కేసులు, మహిళలపై నేరానికి పాల్పడ్డారంటూ ఇద్దరిపై కేసులు ఉన్నాయి. తమళనాడులో కోటీశ్వరులకు కూడా కొదవలేదు.. 157 మంది అంటే 77 శాతం మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలు కోటీశ్వరులని నివేదిక చెబుతోంది.