సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 11 నవంబరు 2020 (20:46 IST)

నాకు టచ్‌లో ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు: సోము వీర్రాజు

తిరుపతి పర్యటనలో ఉన్న బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారే వ్యాఖ్యలు చేశారు. బిజెపి చరిష్మా క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో ఎపిలోను కొంతమంది నేతలు బిజెపిలోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.
 
రాయలసీమలోనే చాలామంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నట్లు బాంబు పేల్చారు సోము వీర్రాజు. త్వరలోనే వారందరూ బిజెపిలోకి వస్తారని.. బిజెపి బలోపేతమవుతోందని, వచ్చే ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయమంటున్నారు. 
 
అలాగే ఎన్నికల ఫలితాలు బిజెపికి ప్రజలిచ్చిన దీవెనలన్న సోము వీర్రాజు మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి జనం ఓటేశారని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి జెండా ఎగురుతుందని.. మోడీ చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా తీసుకెళతామన్నారు.