శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (16:30 IST)

దుబ్బాకలో చరిత్ర సృష్టించిన బీజేపీ...

తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ చరిత్ర సృష్టించింది. అధికార టీఆర్ఎస్ పార్టీని బీజేపీ చిత్తు చేసింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయభేరీ మోగించారు. 
 
ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన కౌంటింగ్‌లో చివరి మూడు రౌండ్లలో బీజేపీ ఆధిక్యత సాధించడంతో... బీజేపీ చివరకు విజయనాదం చేసింది. 1,472 ఓట్ల మెజార్టీతో రఘునందన్ రావు గెలుపొందారు.
 
ఈ ఎన్నికలో బీజేపీ 62,772 ఓట్లను సాధించింది. 61,320 ఓట్లను సాధించిన తెరాస రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 21,819 ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. బీజేపీ గెలుపును ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది.
 
గతంలో దుబ్బాక నుంచి రెండు సార్లు పోటీ చేసిన రఘునందన్ రావు.. మూడో ప్రయత్నంలో ఘన విజయం అందుకున్నారు. బీజేపీ గెలుపుతో హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.